ఫిబ్రవరి 27న పల్స్ పోలియో కార్యక్రమం..

ఫిబ్రవరి 27న పల్స్ పోలియో కార్యక్రమం..వరంగల్ టైమ్స్, జనగామ జిల్లా : ఈ నెల 27న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ శివలింగయ్య తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో పల్స్ పోలియో నిర్వహణ కై ముందస్తుగా జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి సంబంధిత అధికారులతో సమీక్షించారు.జనగామ జిల్లాలో 0-5 సంవత్సరంల లోపు చిన్నారులు 47888 మందిలో వలస వచ్చిన వారు 410మంది ఉన్నారని తెలిపారు. వీరందరికి పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు ఒక్కొక్క పోలియో చుక్కల కేంద్రంలో 4గురి సిబ్బంది చొప్పున 1144 మందిని నియమించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 286 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

అంతేకాకుండా 13 మొబైల్ బృందాలు పర్యటిస్తాయని, స్టేషన్ ఘన్పూర్ రైల్వే స్టేషన్ లో 2, బస్టాండ్ 1, రఘునాధపల్లి రైల్వే స్టేషన్ 1 ఏర్పాటు చేయగా మరొకటి బస్టాండ్ లోను, జనగామ జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ లో 2, జనగామ బస్టాండ్ లో ఒకటి పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. అధికారులందరు సమన్వయంతో పనిచేస్తూ 100 శాతం విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి మహేందర్, జిల్లా పంచాయతీ అధికారి రంగా చారి, జిల్లా విద్యాధికారి రాము, జిల్లా మహిళ శిశు సంక్షేమ అధికారిణి జయంతి, మున్సిపాలిటీ మేనేజర్ రాములు డాక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.