చిన్న జీయర్ కు టీ సర్కార్ బుద్ధి చెప్పాలి: సీతక్క

చిన్న జీయర్ కు టీ సర్కార్ బుద్ధి చెప్పాలి: సీతక్క

వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా : చిన్న జీయర్ స్వామిపై ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నజీయర్ స్వామి తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకలైన సమ్మక్క, సారలమ్మ మీద ఎందుకు అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. సమ్మక్క, సారలమ్మ జాతర వ్యాపారమా అని ప్రశ్నించారు. దేవతల దర్శనానికి ఒక్క రూపాయి కూడా టికెట్ లేదని స్పష్టం చేశారు. చిన్న జీయర్ కు టీ సర్కార్ బుద్ధి చెప్పాలి: సీతక్కమీరు పెట్టిన 120 కిలోల బంగారు సమతామూర్తి బంగారు విగ్రహం చూడ్డానికి 150 రూపాయల టికెట్ ధర పెట్టి మీరు బిజినెస్ చేస్తున్నారు, మేము వనదేవతల దగ్గర ఇలాంటి వ్యాపారం చేయమని స్పష్టం చేశారు. లక్ష రూపాయలు తీసుకోకుండా ఏదైనా పేద వారి ఇంటికి మీరు వెళ్ళారా ? అని సీతక్క ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే రియల్ ఎస్టేట్ స్వామి అయిన చిన్న జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై స్పందించి, తగిన బుద్ధి చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు.