సీఎంను కలిసి థాంక్స్ చెప్పిన ఎర్రోళ్ల శ్రీనివాస్

సీఎంను కలిసి థాంక్స్ చెప్పిన ఎర్రోళ్ల శ్రీనివాస్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సబ్బండ వర్గాలకు , ఉద్యోగులకి, నిరుద్యోగులకు , పేదలకు వరాల జల్లుగా మారిందని టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాలు కేసీఆర్ కి అన్ని వర్గాల మీద ఉన్న నిబద్ధతకు సాక్ష్య గా నిలిచాయని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల ముగింపు అనంతరం ఎర్రోళ్ల శ్రీనివాస్ సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసారు. సీఎంను కలిసి థాంక్స్ చెప్పిన ఎర్రోళ్ల శ్రీనివాస్అసెంబ్లీ సాక్షిగా వరాలు కురిపించిన సీఎంకు ఎర్రోళ్ల శ్రీనివాస్ థాంక్స్ చెప్పారు. ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రభుత్వ ఉద్యోగులు కాకున్నా సరే వాళ్లని మళ్లీ విధుల్లోకి తిరిగి తీసుకోవడం ఐకేపీ సిబ్బందికి , మెప్మా సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనం ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం ఆయన పరిపాలనా దక్షతకు నిదర్శనమని శ్రీనివాస్ కొనియాడారు. ఆరోగ్య శాఖలో ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. ఆహారం, పారిశుద్ధ్య ఏజెన్సీలో 16 శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తూ ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేయడం కేసీఆర్ కి ఎస్సీల పట్ల ఉన్న ప్రేమను చాటుతుందని ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా రిజర్వేషన్లను కల్పించినందుకు అసెంబ్లీ సమావేశాల ముగింపు అనంతరం సీఎం కేసీఆర్ ను కలిసి ఎర్రోళ్ల శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.