పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం
వరంగల్ టైమ్స్, చండీఢ : పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ బుధవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పూర్వీకుల గ్రామం నవన్ షహర్ జిల్లా ఖట్కర్ కలాన్ లో భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్ గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ మాన్ చే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. పంజాబ్ ఎన్నికల్లో 117 స్థానాలకు గాను ఆప్ 92 స్థానాల్లో గెలుపొందగా, పాలక కాంగ్రెస్ కేవలం 18 సీట్లతో సరిపెట్టుకుని ఓటమిపాలైంది.
ధురీ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి దల్వీర్ సింగ్ గోల్డీపై మాన్ 58,206 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక ఆప్ ప్రభంజనంతో సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, సమా పలువురు రాష్ట్ర మంత్రులు, దిగ్గజ నేతలు ఓటమి చవిచూశారు.
5. ఇక నుంచి అమలులోకి ఈ- టూరిస్ట్ వీసా
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 156 దేశాల పౌరుల కోసం ఈ-టూరిస్ట్ వీసాను అమలులోకి తీసుకువచ్చింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ-టూరిస్ట్ వీసాల జారీని 2020 మార్చిలో నిలిపి వేశారు. ప్రస్తుతం జారీ చేయనున్న టూరిస్ట్ వీసాలు ఐదేళ్ల పాటు చెల్లుబాటులో ఉంటాయని పేర్కొంది. అయితే యూఎస్, జపాన్ పౌరుల దీర్ఘకాలిక ( పదేళ్ల) రెగ్యులర్ టూరిస్ట్ వీసాలను సైతం పునరుద్ధరించినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.