`బొంబాట్‌` రెండో లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల

`బొంబాట్‌` రెండో లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల

హైదరాబాద్: ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో సుచేత డ్రీమ్ వర్క్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై `ఈన‌గ‌రానికి ఏమైంది` ఫేమ్ సుశాంత్ హీరోగా, సిమ్రాన్, చాందిని హీరోయిన్స్‌గా రాఘ‌వేంద్ర వర్మ(బుజ్జి) ద‌ర్శ‌క‌త్వంలో విశ్వాస్ హ‌నూర్‌క‌ర్ నిర్మిస్తున్న చిత్రం `బొంబాట్`. జోష్ బి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రెండో లిరిక‌ల్ వీడియో సాంగ్ ‘స్వామినాథ‌’ను శుక్ర‌వారం విడుద‌ల చేశారు.
‘‘బుద్ధిగా కలగన్నాబుజ్జిగా ఎదపైన
సర్జికల్ స్ట్రైక్ ఏదో జరిగిందిరా
అన్నీ దిక్కులలోన ఆక్సిజన్ జడివాన …
స్వామినాథ’’ `బొంబాట్‌` రెండో లిరిక‌ల్ సాంగ్ విడుద‌లఅంటూ సాగే ఈ పాట హీరో హీరోయిన్ మధ్య సాగే రొమాంటిక్ లవ్ సాంగ్. ఈ పాట‌ను ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత రామ‌జోగయ్య శాస్త్రి రాయ‌గా జోష్‌.బి సంగీతం అందించారు. చందన బాల కల్యాణ్, కార్తీక్, హరిణి ఇవటూరి పాటను ఆలపించారు. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. త్వ‌ర‌లోనే సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.