తెలంగాణలో రాగల మూడు రోజులు తేలికపాటి వర్షాలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. 2 రోజులలో మధ్య అరేబియా సముద్రం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం..తెలంగాణలో రాగల మూడు రోజులు తేలికపాటి వర్షాలుఉందని, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని తూర్పు ప్రాంతాల్లో జూన్ 8వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.