ములుగు సమస్యలపై సోమేశ్ కుమార్ ను కలిసిన సీతక్క

ములుగు జిల్లా: ఈ రోజు హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ములుగు ఎమ్మెల్యే సీతక్క మర్యాదపూర్వకంగా కలిశారు. ములుగు నియోజకవర్గంలో వున్న పలు సమస్యలను ఒక లేఖలో పేర్కొని సోమేశ్ కుమార్ కు అందించారు. ములుగు నియోజకవర్గంలో ఉన్న పోడు రైతులకు పట్టాలు ఇప్పించాలని సీతక్క కోరారు. ఫారెస్ట్ అధికారులు భూముల చుట్టూ స్ట్రెంచి కొడుతూ రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఫారెస్ట్ అధికారుల దాడులను ములుగు సమస్యలపై సోమేశ్ కుమార్ ను కలిసిన సీతక్కనివారించాలని ఆమె కోరారు. సీఎం కేసీఆర్ గత అసెంబ్లీ లో ఇచ్చిన మాట ప్రకారం భూములకు పట్టాలు ఇప్పించాలి అని లేఖ లో పేర్కొన్నారు. అదే విధంగా ములుగు నియోజకవర్గంలో ఉన్న ఐటీడీఏ లో ట్రైబల్ అడ్వైజరి సమావేశాన్ని ప్రతి మూడు నెలలకు ఒకసారి ఏర్పాటు చేసి ఐటీడీఏ లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించుకోవడానికి అనువుగా ఉంటుందని వివరించారు. ఐటీడీఏ పరిధిలో గల నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఆదుకోవాలని సీతక్క లేఖలో వేడుకున్నారు.