చన్నీళ్లతో స్నానం .. మంచిదేనా..!
వరంగల్ టైమ్స్, హెల్త్ డెస్క్ : చలికాలం, ఎండాకాలం, వానాకాలం కాలమేదైనా వేడి వేడి నీళ్లతో స్నానం చేయడం కంటే చన్నీళ్లతో స్నానం చేయడం మంచిదనే విషయం ఒకప్పటి నానుడి. తెల్లవారుజామున చన్నీళ్లతో స్నానం చేస్తే ఆరోగ్య ప్రయోజనాలుంటాయనేది పెద్దలు చెప్పిన మాట. కానీ ఇప్పుడు అది కాస్త ముప్పుకు దారి తీస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఏ కాలంలోనేనా, మరీ చలికాలంలో అయితే చన్నీళ్లతో స్నానం చేస్తే ఇక అంతే సంగతులు.
పలు అధ్యయనాల ప్రకారం, చలికాలంలో ముఖ్యంగా చన్నీళ్లతో స్నానం చేసినవారే బ్రెయిన్ స్ట్రోక్ కు గురవుతున్నారట. చన్నీళ్లతో స్నానం చేసే సమయంలో రక్తనాళాలు కుంచించుకుపోయి ఒక్కసారిగా రక్తపోటు పెరుగుతుంది. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, స్థూలకాయం వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేయడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ కు లోనవుతారని తెలిపింది.