రేపటి నుంచే రైతుబంధు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : యాసంగికి సంబంధించి రైతుబంధు పెట్టుబడి సాయం బుధవారం నుంచి రైతులకు అందనుంది. ఆ రోజు ఉదయం నుంచే రైతుబంధు పైసలు రైతుల బ్యాంకు అకౌంట్లో జమ కానున్నాయి. ఈ సీజన్ లో సుమారు 66 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయంగా రూ.7600 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. రైతుబంధుకు అవసరమైన నిధులను సిద్ధం చేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.
అర్హులైన ఏ ఒక్కరూ నష్టపోకుండా చివరి రైతు వరకు రైతుబంధు పెట్టుబడి సాయం అందించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ, ఆర్థికశాఖల అధికారులు పెట్టుబడి సాయం పంపిణీపై పకడ్భందీ చర్యలు తీసుకొన్నారు. గత వానాకాలం సీజన్ లోనే రూ.50 వేల కోట్ల మార్క్ ను దాటిన రైతుబంధు సాయం, ఈ సీజన్ తో రూ.65 వేల కోట్లకు చేరుతుండటం గమనార్హం.