మృత్యుపాశంలా హిమపాతాలు
వరంగల్ టైమ్స్, ఇంటర్నేషనల్ డెస్క్ : అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం సృష్ఠించింది. దీని ఎఫెక్ట్ తో ఆ దేశ తూర్పు ప్రాంతంలో దాదాపు 32 మంది మృతి చెందారు. ఒక్క నయాగరా, ఎరీ కౌంటీల్లోనే 17 మంది మృతి చెందారు. మంచు తీవ్రత మరీ ఎక్కువగా ఉండటంతో రహదారులన్నీ కనిపించడం లేదు. దీంతో అనేక చోట్ల ప్రమాదాలు సంభవించి చనిపోతున్నారు. విద్యుత్ సరఫరా ఆగిపోయి ఆ ప్రాంతాలన్నీ చీకటిమయమైపోయాయి.విమానాలు, రైళ్లు, ఇతర వాహనాల సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది. బఫెలో ఎయిర్ పోర్టులో 43 అంగుళాల మేరకు మంచు పేరుకుపోయిందని ఆ దేశ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అటు జపాన్ లోనూ మంచు తీవ్రతకు 14 మంది మృత్యువాతపడ్డారు. జపాన్ కు ఉత్తరంగా ఉన్నహొకైడో, దక్షిణంగా ఉన్న క్యుషుతో పాటు అర్చిపెలాగో దీవుల్లో మంచు తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. ఇక్కడ మంచు పొరల స్థాయిలు 1.20 మీటర్ల స్థాయికి చేరాయి.