దుండగుల దాడిలో గాయపడ్డ జెడ్పీటీసీ మృతి
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : దుండగుల దాడిలో గాయపడ్డ సిద్దిపేట జిల్లా చేర్యాల జెడ్పీటీసీ మల్లేశం మృతి చెందారు. సికింద్రాబాద్ లోని యశోదా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారని వైద్యులు తెలిపారు. కాగా సోమవారం ఉదయం జిల్లాలోని గుర్జకుంట వద్ద వాకింగ్ చేస్తుండగా మల్లేశంపై దుండగులు గొడ్డళ్లు, కత్తులతో దాడి చేశారు. దీంతో ఆయన తలకు తీవ్ర గాయాలవడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లారు.
కుటుంబసభ్యులు ఆయనను సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకువచ్చారు. అయితే చికిత్స పొందుతూ మల్లేశం మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.