కామ్రేడ్ బండ్రు నర్సింహులు అస్తమయం

కామ్రేడ్ బండ్రు నర్సింహులు అస్తమయంహైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, జనశక్తి నాయకులు కామ్రేడ్ బండ్రు నర్సింహులు ఇకలేరు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీపీఐ(ఎంఎల్) జనశక్తి నాయకులు, ప్రజావిమోచన సంపాదకులు కామ్రేడ్ బండ్రు నరసింహులు (104) శనివారం మధ్యాహ్నం 3 గంటలకు తుది శ్వాస విడిచారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో వారం రోజులుగా హాస్పిటల్ లో చికిత్స పొందిన బండ్రు నరసింహులు ఆరోగ్యం కుదుటపడటంతో శుక్రవారం రాత్రి డిశ్చార్జ్ అయ్యారు. ఆక్సిజన్ సహాయంతో బాగ్ అంబర్పేట్ లోనే తన పెద్ద కుమారుడు బండ్రు ప్రభాకర్ వద్ద చికిత్స పొందుతూ కార్డియాక్ అరెస్ట్ తో తనువు చాలించారు. తన పార్థివదేహాన్ని మెడికల్ కాలేజీకి డొనేట్ చేసినందున శనివారం రాత్రి 8గం||ల వరకే అంతిమ సందర్శనార్థం బాగ్ అంబర్పేట్ లో ఉంచుతారు.