ఇక నుంచి ప్రభుత్వ స్కూళ్లలోనూ ఆన్లైన్ క్లాసులే

ఇక నుంచి ప్రభుత్వ స్కూళ్లలోనూ ఆన్లైన్ క్లాసులేహైదరాబాద్ : తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 24 నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 8, 9, 10 తరగతులకు ఆన్లైన్ లో పాఠాలు బోధించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సిబ్బంది 50 శాతం మాత్రమే విధులకు హాజరుకావాలని, రొటేషన్ పద్ధతిలో 50 శాతం సిబ్బంది మాత్రమే హాజరుకావాలని సూచించింది.