టీఎస్ఎస్పీ అదనపు డీజీగా స్వాతి లక్రా
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : సీనియర్ ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా టీఎస్ఎస్పీ బెటాలియన్స్ అడిషనల్ డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. గత నాలుగేండ్ల నుంచి స్వాతి లక్రా తెలంగాణ మహిళా భద్రతా విభాగం అదనపు డీజీగా సేవలందించారు. టీఎస్ఎస్పీ అదనపు డీజీగా స్వాతి లక్రా బదిలీ అయింది. దీంతో ఆమెకు నిన్న మహిళా భద్రతా విభాగం అధికారులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. స్వాతి లక్రాపై పూలవర్షం కురిపించి, ఆమెపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. పోలీస్ మహిళా భద్రతా విభాగం చీఫ్ గా ఏడీజీ శిఖా గోయెల్ సోమవారం బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.