టీజీఓలకు, టీఎన్జీఓలకు అభినందనలు: ఎర్రబెల్లి

హనుమకొండ జిల్లా : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు అధికారులు, ఉద్యోగులు చేస్తున్న కృషి అభినందించిన విషయమని రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభిృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో రాష్ట్ర పర్యాటక , సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతులతో కలిసి తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం- 2022 సంవత్సరపు డైరీ, క్యాలండర్ లను ఆవిష్కరించారు.టీజీఓలకు, టీఎన్జీఓలకు అభినందనలు: ఎర్రబెల్లిఉద్యోగులకు పీఆర్సి, పదోన్నతులు, ఇతర ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని చర్యలు తీసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ముందు వరుసలో ఉంటుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. టీజీఓల కు ఎలాంటి సహాయమైనా చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుతమైన పీఆర్సీ, ఒక్కేసారి నాలుబై వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వడం చాల గొప్ప విషయమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇతర రాష్ట్రాల వారు తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు ఐతే బాగుండు అని చెప్పుకుంటున్నారని గుర్తు చేశారు. తెలంగాణ గెజిటెడ్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా పనిచేయాలని శ్రీనివాస్ గౌడ్ అధికారులు, ఉద్యోగులకు పిలుపునిచ్చారు. కష్టపడి పని చేసి మంచి గుర్తింపు పొందాలని సూచించారు. ఎలాంటి సమస్యలు, ఉన్న అన్ని విషయాల పట్ల ప్రభత్వం శ్రద్ద తీసుకుంటుందని చెప్పారు. టీజీఓ లకు, టీఎన్జీఓలకు ప్రతేక్య అభినందనలు తెలిపారు.టీజీఓలకు, టీఎన్జీఓలకు అభినందనలు: ఎర్రబెల్లితెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం, టీఎన్జీఓలు అంటే తన కుటుంబసభ్యుల్లాగా భావించి, నిరంతరం వారి విజ్ఞప్తులు, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. టీజీఓ భవనం విస్తరణ కోసం వెంటనే పది లక్షలు నిధులు మంజూరు చేస్తన్నాని ఆయన తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న మంత్రులు వి శ్రీనివాస్ గౌడ్ , ఎర్రబెల్లి దయాకర్ రావు, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ లకు టీజీఓ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు జగన్ మోహన్ రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశానికంటే ముందు మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, శ్రీనివాస్ గౌడ్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ టీజీఓ కార్యాలయాన్నిప్రారంభించారు.