భారత్ లో కొత్తగా 2,71,202 కరోనా కేసులు

భారత్ లో కొత్తగా 2,71,202 కరోనా కేసులున్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతూనే ఉంది. కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ క్రమంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 2,71,202 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 314 మంది మరణించారు. నిన్నటి కంటే 2,369 కేసులు అధికంగా నమోదు అయ్యాయి. మరో 1,38,331 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 15,50,377 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. పాజిటివిటీ రేటు 16.28 శాతంగా ఉంది. ఇక ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 7,743 కు చేరింది.