ఈనెల 17 నుంచి జేఎన్టీయూ పరిధిలో ఆన్లైన్ క్లాసులు

హైదరాబాద్ : తెలంగాణలో అన్ని విద్యాసంస్థలకు జనవరి 30 వరకు సెలవులు పొడిగించిన నేపథ్యంలో జేఎన్టీయూ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 17 నుంచి 22 వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయించింది. యూజీ, పీజీ కోర్సుల ( బీటెక్ , బీఫార్మసీ ) (ఎంటెక్, ఎంఫార్మసీ) విద్యార్థులతో పాటు ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మ్ డీ ఫార్మ్ డీ ( పీబీ) విద్యార్థులకు ఆన్లైన్ లో క్లాసులు నిర్వహించనున్నారు. ఇతర వివరాల కోసం జేఎన్టీయూ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.