ఆశావర్కర్లకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చిన చీఫ్ విప్ దాస్యం 

ఆశావర్కర్లకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చిన చీఫ్ విప్ దాస్యం

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : ఆశావర్కర్లు ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడం కోసమే వారికి స్మార్ట్ ఫోన్లు అందిస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను వినియోగించుకుని ప్రజలకు మరింత సేవ చేయాలని చీఫ్ విప్ ఆశావర్కర్లకు సూచించారు. చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, డీఎంహెచ్ డా.లలితదేవి తో కలిసి గురువారం హనుమకొండలోని ఎస్ఎస్ ఫంక్షన్ హాల్ లో హనుమకొండ జిల్లా పరిధిలోని 103 మంది ఆశావర్కర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. ఆశావర్కర్లకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చిన చీఫ్ విప్ దాస్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ భగీరథ, త్రాగు నీరు, సుమారు 7వేల కోట్లతో మన ఊరు మన బడి కార్యక్రమం, ఆశా వర్కర్లు కు భారీ స్ధాయిలో 9750/-ల వేతనం ఇచ్చామని దాస్యం వినయ్ భాస్కర్ చెప్పారు. గత ప్రభుత్వం ఇచ్చే అర కొర వేతనాలతో ఆశావర్కర్లకు అనేక ఇబ్బందులు ఉండేవని, సీఎం కేసీఆర్ ఉద్యోగుల సంక్షేమం కోసమే వివిధ రకాల సదుపాయాలు అందుబాటులో తీసుకువచ్చారని అన్నారు.అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 28 వేల మంది ఆశా వర్కర్లకు దశల వారీగా స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఆశావర్కర్లకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చిన చీఫ్ విప్ దాస్యం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఇంటింటి జ్వర సర్వే కార్యక్రమంలో భాగంగా ప్రజల ఆరోగ్య స్థితి గతులు తెలుసుకునేందుకు ఆశా వర్కర్లు వివిధ రకాల (10) ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ఈ ఫోన్లు ఇస్తున్నారని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా ప్రతీ ఒక్కరూ వారి వారి బాధ్యతగా విధులు నిర్వహించాలని చీఫ్ విప్ కోరారు. కరోనా కాలంలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు అందించిన సేవలను కొనియాడుతూ, ఆశా వర్కర్లను దాస్యం వినయ్ భాస్కర్ అభినందంచారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సోదాకిరణ్, చెన్నం మధు, బొంగు అశోక్, మామిడాల రాజు, గుంట రజిత, రాం ప్రసాద్, డా. ఉమాశ్రీ, డా. విజయ్, డా. సౌజన్య, ప్రియాంకా, హిమబిందు, దీపక్, చంద్ర శేఖర్, సుశీల, ఆశా వర్కర్లు, సిఓలు, తదితరులు పాల్గొన్నారు.