అల్లం నారాయణను పరామర్శించిన ఎర్రబెల్లి

అల్లం నారాయణను పరామర్శించిన ఎర్రబెల్లి

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మ కొద్ది రోజుల క్రితం మరణించిన విషయం తెలిసిందే. అల్లం నారాయణను పరామర్శించిన ఎర్రబెల్లిదీంతో గురువారం అల్లం నారాయణ నివాసానికి వెళ్లిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అల్లం పద్మ చిత్ర పటం వద్ద పుష్పాంజలి ఘటించి, నివాళలర్పించారు. ఆమె మరణానికి దారి తీసిన పరిస్థితులను తెలుసుకొని, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అల్లం నారాయణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.