దేశంలోని అత్యుత్తమ పోలీస్‌స్టేషన్ల జాబితా విడుదల

దేశవ్యాప్తంగా అత్యుత్తమ పోలీస్‌స్టేషన్ల జాబితాను కేంద్ర హోంశాఖ గురువారం ప్రకటించింది.

దేశంలోని అత్యుత్తమ పోలీస్‌స్టేషన్ల జాబితా విడుదల

హైదరాబాద్: తొలి స్థానంలో మణిపూర్‌లోని నాంగ్‌పోక్ షికమై పోలీస్‌స్టేషన్ నిలవగా, పదో స్థానంలో కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట పోలీసు స్టేషన్ నిలిచింది. దేశ వ్యాప్తంగా 16,671 పోలీస్‌స్టేషన్లకు వివిధ విభాగాల్లో స్టేషన్ల పనితీరు ఆధారంగా ర్యాంకులు ఇవ్వాలని కేంద్ర హోంశాఖ గతంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ఇవాళ జాబితాను విడుదల చేసింది. 16,671 పోలీసు స్టేషన్లను పరిశీలించిన అనంతరం.. 10 పోలీసు స్టేషన్లను అత్యుత్తమ పీఎస్‌లుగా ఎంపిక చేశారు. మరో 75 పోలీసు స్టేషన్లలో కూడా పనితీరు అద్భుతంగా ఉన్నట్లు కేంద్ర హోంశాఖ గుర్తించింది.

టాప్ టెన్ పోలీసు స్టేషన్లు..

1. నాంగ్‌పోక్ షికమై(మణిపూర్‌)

2. ఎడబ్ల్యూపీఎస్ – సురమంగళం(సేలం, తమిళనాడు)

3. ఖర్షంగ్‌(చంగ్లాంగ్, అరుణాచల్ ప్రదేశ్‌)

4. జిల్‌మిలి(సూరజ్‌పూర్‌, ఛత్తీస్‌గఢ్‌)

5. సంగ్యూమ్(గోవా)

6. కాలిఘాట్‌(అండమాన్, నికోబార్ దీవులు)

7. పాక్యోంగ్(సిక్కిం)

8. కాంత్(మోర్దాబాద్, ఉత్తరప్రదేశ్‌)

9. ఖన్‌వెల్‌(దాద్రా, నగర్ హవేలీ)

10. జమ్మికుంట టౌన్‌(కరీంనగర్, తెలంగాణ)

దేశంలోని అత్యుత్తమ పోలీస్‌స్టేషన్ల జాబితా విడుదల