కుర్రాడికి ఎన్నిక విధులనడం అవాస్తవం:ఈసీ

కుర్రాడికి ఎన్నిక విధులనడం అవాస్తవం..రాష్ట్ర ఎన్నికల సంఘం

కుర్రాడికి ఎన్నిక విధులనడం అవాస్తవం:ఈసీహైదరాబాద్​ : పదిహేడేళ్ల కుర్రాడిని ఎన్నికల విధులకు కేటాయించరనడంలో నిజంలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం వివరణ ఇచ్చింది. ఆ అబ్బాయిని వెబ్ క్యాస్టింగ్ నిర్వహించడానికి పోలింగ్ కేంద్రంలో నియమించామన్నారు. వెబ్ క్యాస్టింగ్ కొరకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న విద్యార్థులను మాత్రమే నియమిస్తామని తెలిపారు. వీరికి వయస్సుతో సంబంధం ఉండదన్నారు. ఆ కుర్రాడు మధ్యాహ్నం భోజనం చేయడానికి మాత్రమే ఇతర పోలింగ్ సిబ్బందితో పాటు కూర్చున్నట్లు స్పష్టం చేశారు. అంతేగాని ఆ అబ్బాయికి ఎన్నికల విధులు కేటాయించామనడంలో ఎటువంటి వాస్తవం లేదన్నారు.