రాజకీయ పార్టీపై క్లారిటీ ఇచ్చిన తలైవా

తలైవా క్లారిటీ కొత్త రాజకీయ పార్టీ ప్రటకన
డిసెంబర్​31న పూర్తి వివరాలు వెల్లడిస్తా : రజనీకాంత్​

రాజకీయ పార్టీపై క్లారిటీ ఇచ్చిన తలైవాచెన్నై: రజనీకాంత్​ రాజకీయ ప్రకటనపై సస్పెన్స్​ వీడింది. జనవరిలో కొత్త రాజకీయ పార్టీ పెడతానని గురువారం రజనీ తన ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈప్రకటనతో రజినీ అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. తమకు ఈ కొత్త సంవత్సరం గిఫ్ట్​గా భావిస్తున్నట్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే రజినీ చేసిన ఈ ప్రకటనతో ఒక్కసారిగా తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారనున్నాయి. రజనీ పార్టీ వల్ల ఎవరకి ఏవిధంగా మేలు కలుగుతుంది.. ఎవరికి నష్టం జరుగుతుందని ఆయా పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. అయితే సినీరంగం నుంచి వచ్చిన రజనీ రాజకీయ పార్టీ పెట్టి ఏ మేరకు రాణిస్తాడోనని పలువురు రాజకీయ ప్రముఖులు, విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

రాజకీయ పార్టీపై క్లారిటీ ఇచ్చిన తలైవా