నల్లగొండ జిల్లా : నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య భౌతికకాయానికి సీఎం కేసీఆర్ ఘనంగా నివాళుర్పించారు. గురువారం నోముల అంత్యక్రియలు ఆయన స్వగామమైన నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలోని పాలెం గ్రామంలో ప్రభుత్వ లాంఛనలతో నిర్వహించారు. ఉదయం 11 :30 గంటలకు పాలెం చేరుకున్న సీఎం కేసీఆర్ నర్సింహయ్య భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతంర కుటుంబ సభ్యులకు పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.