రైతులకు మద్దతుగా నిరసన పలువురు అరెస్ట్​

రైతులకు మద్దతుగా నిరసన పలువురు అరెస్ట్​విజయవాడ : నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా విజయవాడలో గురువారం వివిధ రైతు సంఘాలు, వామపక్ష నేతలతో కలిసి రాస్తారోకో చేశారు. బెంజి సర్కిల్ వద్ద జరిగిన ఈ ఆందోళనలో పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వర రావు, సీపీఎం నేత సీహెచ్ బాబూరావు ఉన్నారు.