చల్లా ఆధ్వర్యంలో ఘనంగా కేసీఆర్ బర్త్ డే వేడుకలు

చల్లా ఆధ్వర్యంలో ఘనంగా కేసీఆర్ బర్త్ డే వేడుకలువరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకలు పరకాల నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరి 17న కేసీఆర్ బర్త్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిండెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 15 నుంచి నేటి వరకు మూడు రోజుల పాటు టీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ బర్త్ డే వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో గురువారం తెల్లవారు జామునుంచే నియోజకవర్గంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో కేసీఆర్ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పేదలకు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. పరకాల మండలం శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కేక్ కట్ చేశారు. పరకాల పట్టణంలోని ప్రసిద్ధ దేవాలయంగా పేరుగాంచిన శ్రీ కుంకుమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.చల్లా ఆధ్వర్యంలో ఘనంగా కేసీఆర్ బర్త్ డే వేడుకలుఅంబరాన్నంటిన కేసీఆర్ బర్త్ డే వేడుకలు..
దామెర మండలం ఊరుగొండ గ్రామంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతథిగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అంబెద్కర్ సెంటర్ లో కేక్ కట్ చేసి కేసీఆర్ కు బర్త్ డే విషెష్ తెలిపారు.

శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో ఎమ్మెల్యే చల్లా ప్రత్యేక పూజలు..
రాష్ట్ర సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆత్మకూరు మండలం అగ్రంపాడ్ శ్రీ సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. అమ్మవార్ల ఆశీస్సులతో, రాష్ట్ర ప్రజల దీవెనలతో కేసీఆర్ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరకు వచ్చిన భక్తులకు అన్ని వసతులు ఏర్పాటు చేశామని, భక్తులు సమన్వయం పాటిస్తూ అమ్మవార్లను దర్శించుకోవాలని ఎమ్మెల్యే చల్లా కోరారు. అనంతరం జీఎస్ఆర్ గార్డెన్స్ లో కేక్ కట్ చేసి సీఎం కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు.చల్లా ఆధ్వర్యంలో ఘనంగా కేసీఆర్ బర్త్ డే వేడుకలుఅక్కడి నుంచి గీసుగొండ మండలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉద్యమనేత, సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుతూ మండల గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని వేడుకున్నారు. సంగెం మండల కేంద్రంలో సీఎం జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదటగా గ్రామంలోని శ్రీ సంగమేశ్వర ఆలయంలో స్వామివారికి పూజలు, అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి కేసీఆర్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.