ఏపీపీఎస్సీ చైర్మన్ గా గౌతమ్ సవాంగ్

ఏపీపీఎస్సీ చైర్మన్ గా గౌతమ్ సవాంగ్

వరంగల్ టైమ్స్,అమరావతి: ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( ఏపీపీఎస్సీ) చైర్మన్ గా మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండ్రోజుల క్రితం డీజీపీ పోస్టు నుంచి బదిలీ చేసే ఆయన స్థానంలో కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నూతన డీజీపీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.