హ్యాపీ బర్త్ డే లో సత్య ఫస్ట్ లుక్ రిలీజ్

హ్యాపీ బర్త్ డే లో సత్య ఫస్ట్ లుక్ రిలీజ్

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : లావణ్య త్రిపాఠి, సత్య, నరేష్ అగస్త్య, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా హ్యాపీ బర్త్ డే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిరంజీవి (చెర్రీ), హేమలతా పెదమల్లు నిర్మాణ బాధ్యతలు వహిస్తుండగా నవీన్ యేర్నేని, వై రవిశంకర్ సమర్పిస్తున్నారు. మత్తు వదలరా చిత్రంతో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రితేష్ రానా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. యాక్షన్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న హ్యాపీ బర్త్ డే సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుంచి నటుడు సత్య బర్త్ డే సందర్భంగా అతని ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.హ్యాపీ బర్త్ డే లో సత్య ఫస్ట్ లుక్ రిలీజ్మత్తు వదలరా చిత్రంలో మంచి కామెడీ పాత్రతో బాగా నవ్వించిన సత్య, హ్యాపీ బర్త్ డే సినిమాలోనూ కంప్లీట్ ఎంటర్ టైనింగ్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ క్యారెక్టర్ డిజైనింగ్, డైలాగ్స్ కొత్తగా ఉండబోతున్నాయి. ఈ ఫస్ట్ లుక్ లో సత్య స్టైల్ గా రెడీ అయిన కనిపిస్తున్నాడు, అతని పక్కన పిస్టల్ ఉంది. ఏ టు జెడ్ క్లీనింగ్ సర్వీసెస్ బోర్డు, నో గన్ నో ఎంట్రీ అనే క్యాప్షన్ రాశారు. హత్యలకు రాసిన ధరల పట్టిక చూడగానే నవ్వించేలా ఉంది. ఫిక్షనల్ ప్రపంచంలో సాగే హ్యాపీ బర్త్ డే ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని పంచే చిత్రమవుతుందని నిర్మాతలు నమ్మకంతో ఉన్నారు.

నటీనటులు – లావణ్య త్రిపాఠి, సత్య, నరేష్ అగస్త్య, వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్ తదితరులు
సాంకేతిక నిపుణులు :
సంగీతం : కాలభైరవ,
సినిమాటోగ్రఫీ : సురేష్ సారంగం,
ఫైట్స్ : శంకర్ ఉయ్యాల,
ప్రొడక్షన్ డిజైనర్ : నార్ని శ్రీనివాస్,
లైన్ ప్రొడ్యూస : అలేఖ్య పెదమల్లు,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : బాబా సాయి,
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : బాలసుబ్రహ్మణ్యం కేవీవీ,
ప్రొడక్షన్ కంట్రోలర్ : పస్తా సుమన్ నాగశేఖర్,
బ్యానర్స్ : మైత్రీ మూవీ మేకర్స్,
క్లాప్ ఎంటర్ టైన్ మెంట్,
పీఆర్వో : మధు మడూరి,
సమర్పణ : నవీన్ యేర్నేని,
వై రవిశంకర్, నిర్మాతలు : చిరంజీవి (చెర్రీ), హేమలతా పెదమల్లు,
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : రితేష్ రానా.