నకిలీ మావోయిస్టులు అరెస్ట్

నకిలీ మావోయిస్టులు అరెస్ట్ములుగు జిల్లా : మావోయిస్టులుగా చలామణి అవుతున్న నలుగురు నకిలీ మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నకిలీ మావోయిస్టులను ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ ఆధ్వర్యంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. అరెస్ట్ కు సంబంధించిన వివరాలను ఎస్పీ సంగ్రామ్ సింగ్ తెలిపారు. మావోయిస్టుల పేరు చెప్పుకుంటూ రూ.20 లక్షలు ఇవ్వాలని బెదిరిస్తున్నారన్న సమాచారం మేరకు తనిఖీలు చేపట్టారు.

ఈ మేరకు ఏటూరునాగారం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, ఒక నకిలీ ప్లాస్టిక్ పిస్తోల్ లభ్యమైనట్లు పేర్కొన్నారు. మావోయిస్టు దామోదర్ పేరుమీద గల తెలంగాణ స్టేట్ కమిటీ మావోయిస్టు పార్టీ లెటర్ లభించినట్లు తెలిపారు.

అనంతరం నిందితుడిని విచారించగా ఇంకా మిగతా ముగ్గురు నిందితులు కూడా ఈ దోపిడిలో ఉన్నారని తెలిపారు. జాతీయ రహదారిపై రొయ్యూరు గ్రామం శివారులోని ప్రధాన నిందితుడి కోసం వేచి చూస్తున్నట్లు తెలుపగా వెంటనే ఆ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వారినుంచి రూ.13 లక్షల 50 వేలు నగదు, సీపీఐ మావోయిస్టు దామోదర్ పేరుతో గల పార్టీ లెటర్ ప్యాడ్, ఒక నకిలీ పిస్తోల్, 40ఇన్ ఎమ్ఐ కలర్ టీవీ, ఒకటి జస్ట్ కార్, 4 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకుని, నలుగురు నకిలీ నక్సలైట్లను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.