రెండు నెలలు వాయిదా పడిన నీట్- పీజీ ఎంట్రన్స్

రెండు నెలలు వాయిదా పడిన నీట్- పీజీ ఎంట్రన్స్హైదరాబాద్ : పీజీ వైద్య విద్య సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశానికి జరిగే నీట్-పీజీ సూపర్ స్పెషాలిటీ ఎంట్రన్స్ 2 నెలలు వాయిదా వేస్తామని కేంద్రం ప్రకటించింది. సవరించిన ప్రశ్నాపత్రం సిలబస్ తో విద్యార్థులు ప్రిపేర్ కావడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొంది. చివరి క్షణంలో ఎంట్రన్స్ సిలబస్ లో మార్పులేమిటని గతవారం కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

ఈ నేపథ్యంలో కేంద్రం పైవిధంగా అఫిడవిట్ దాఖలు చేసింది. విద్యార్థులు మరింతగా సన్నద్ధమయ్యేందుకు నీట్ -పీజీ ఎంట్రన్స్ ను 2022 జనవరి 10,11 తేదీల్లో నిర్వహించేందుకు అనుమతించండి అని కేంద్రం కోరింది. సవరించిన సిలబస్ తో ఎంట్రన్స్ నిర్వహణకే కట్టుబడి ఉన్నామని తెలిపింది. మొదట నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వచ్చేనెల 13, 14 తేదీల్లో నీట్ – పీజీ ఎంట్రన్స్ నిర్వహించాల్సి ఉంది.