ధాన్యం కొనకపోతే ఇక కొట్లాటే : ఎమ్మెల్యే చల్లా

ధాన్యం కొనకపోతే ఇక కొట్లాటే : ఎమ్మెల్యే చల్లా

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : రాష్ట్రంలో పండిన ధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే కొట్లాట తప్పదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికూడ మండల కేంద్రం, పరకాల పట్టణం, పరకాల కేంద్రంలో జరిగిన రైతు నిరసన దీక్షల్లో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. ధాన్యం కొనకపోతే ఇక కొట్లాటే : ఎమ్మెల్యే చల్లాధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తుందని ఎమ్మెల్యే చల్లా ఆరోపించారు. బీజేపీ నాయకులు తలా తోకా లేకుండా మాట్లాడుతుండగా, కేంద్రం కొర్రీలు పెడుతుందని విమర్శించారు. ప్రస్తుత యాసంగి వడ్ల కొనుగోలుపై దాటవేస్తూ వివక్ష చూపుతుందని చల్లా ధర్మారెడ్డి మండిపడ్డారు. దీనిపై తాడోపేడో తేల్చకపోతే అన్నదాతలు మరింత నష్టపోయే ప్రమాదమున్నదని చెప్పారు. తెలంగాణ రైతుల ప్రయోజనం కోసం ఢిల్లీపై సీఎం కేసీఆర్ దండయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. ధాన్యం కొనకపోతే ఇక కొట్లాటే : ఎమ్మెల్యే చల్లానాడు తెలంగాణ ఏర్పాటు కోసం ఉద్యమనేతగా సమైక్య రాష్ట్రంలో కర్షకుల ఆత్మహత్యలను కండ్లారా చూసి కేసీఆర్ చలించిపోయారని చల్లా గుర్తు చేశారు. నేడు ఆ దుస్థితి నుంచి తెలంగాణ ప్రజలను బయటపడేసేందుకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే అన్నదాతల జీవన్మరణ సమస్యగా మారిన ధాన్యం కొనుగోలుకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ మరో ఉద్యమానికి పూనుకున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ తీసుకున్న పోరుబాటకు నియోజకవర్గ రైతులు వెంట ఉంటారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్పష్టం చేశారు.

 

ధాన్యం కొనుగోలుపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గుర్తు చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్మల్ని వంద అన్న పడతాం మా తెలంగాణ సమాజాన్ని అంటే అస్సలు ఊర్కోమని హెచ్చరించారు. ఇక్కడి బీజేపీ నాయకులు కేంద్రమంత్రికి వత్తాసు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రైతులను రెచ్చగొట్టి వరి వేయించిన బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. కేంద్రం మెడలు వంచైనా తెలంగాణ ధాన్యం కొనిపిస్తామని తెలిపారు. తెలంగాణ వడ్లు కొనే వరకు కేంద్రంలోని బీజేపీని, రాష్ట్ర బీజేపీ నాయకుల్ని ఎక్కడికక్కడ నిలదీస్తామని చల్లా ధర్మారెడ్డి హెచ్చరించారు.