సంక్రాంతి సంబరాల్లో సీఎం జగన్‌ దంపతులు

సంక్రాంతి సంబరాల్లో సీఎం జగన్‌ దంపతులుతాడేప‌ల్లి(అమ‌రావ‌తి) : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం వైఎస్‌ జగన్‌, ఆయ‌న స‌తీమ‌ణి భార‌తీ దంపతులు పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో వేడుకలకు సీఎం హాజరయ్యారు. వేడుకల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో చిన్నారులతో సీఎం జగన్‌ సరదాగా కాసేపు ముచ్చటించారు. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి అని పేర్కొన్నారు. ప్రతి ఇంట ఆనందాలు వెల్లి విరియాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు.