సీఎం కేసీఆర్ బాటలో సీఎం స్టాలిన్

సీఎం కేసీఆర్ బాటలో సీఎం స్టాలిన్చెన్నై : తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ను తమిళనాడు సీఎం స్టాలిన్ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. పేదింటి ఆడబిడ్డల పెళ్లి కోసం తల్లిదండ్రులు అప్పులపాలు కాకుండా మేనమామ బాధ్యతలు స్వీకరించిన సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి పేరుతో ఓ బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా పెళ్లి చేసుకున్న ఆడపడుచు పుట్టింటి కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ. 1 లక్షా 116 ఆర్థికసాయం అందిస్తున్నారు.

కేసీఆర్ స్ఫూర్తితో, తెలంగాణ కళ్యాణలక్ష్మి పథకం ప్రేరణతో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గురువారం ఆడబిడ్డల పెళ్లిళ్ల పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆడపిల్ల పెళ్లి కోసం వధువు కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు 8 గ్రాముల బంగారు కాసు అందచేయనున్నారు. ఇందులో భాగంగా తమిళనాడు సర్కార్ 94 వేల మందికి పైగా అమ్మాయిల వివాహానికి ఏకంగా రూ. 750 కోట్లు కేటాయించింది.