రిటైర్డ్ పురోహితుల పింఛన్ ను పెంచిన సీఎం స్టాలిన్

చెన్నై : తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ రిటైర్డ్ పురోహితుల పింఛన్ పథకాన్ని తాజాగా ప్రారంభించారు. గతంలో రూ. 3000 ఉన్న పురోహితుల పింఛను రూ. 4000 లకు పెంచుతూ తమిళనాడు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తమిళనాడులో ఉన్న 1804 మంది పురోహితులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. దీంతో లబ్ధిదారులైన పురోహితులు సీఎం స్టాలిన్ కు కృతజ్ఞతలు తెలిపారు.