నల్లగొండలో ఐటీ హబ్..శంకుస్థాపన చేయనున్నకేటీఆర్

నల్లగొండలో ఐటీ హబ్..శంకుస్థాపన చేయనున్నకేటీఆర్హైదరాబాద్ : నేడు నల్లగొండలో ఐటీ హబ్ కు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇప్పటికే వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు ఐటీ హబ్ లు విస్తరించాం. ఇప్పుడు నల్లగొండలో ఐటీ హబ్ ఏర్పాటు చేయబోతున్నాం. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీని ప్రోత్సహించేలా ఐటీ హబ్ ను నెలకొల్పుతున్నామని తెలిపారు. 18 నెలల్లో నల్లగొండ ఐటీ హబ్ ను అందుబాటులోకి తెస్తామని కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.