ఆర్టీసీలో ఆ ఒక్క రోజు ఫ్రీ

ఆర్టీసీలో ఆ ఒక్క రోజు ఫ్రీహైదరాబాద్ : న్యూఇయర్‌ను పురస్కరించుకుని తెలంగాణ ఆర్టీసీ రాష్ట్రంలోని చిన్నారులకు చిరు కానుకను ప్రకటించింది. కొత్త సంవత్సరం తొలి రోజున పిల్లలకు టీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సదుపాయాన్ని అందిస్తున్నది. తల్లిదండ్రులతో కలిసి ప్రయాణించే 12 ఏండ్లలోపు చిన్నారులకు జనవరి ఒకటిన ఒక్క రోజు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్టు టీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు.

ఈ సదుపాయం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్సుల్లో వర్తిస్తుందని, ఈ మేరకు ఆర్టీసీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సజ్జనార్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది బాలల దినోత్సవం సందర్భంగా కూడా 15 ఏండ్లలోపు చిన్నారులకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ఆర్టీసీ వీలు కల్పించిన విషయం తెలిసిందే.