సీఎం కేసీఆర్ ను కలిసిన చీఫ్ విప్ దాస్యం

సీఎం కేసీఆర్ ను కలిసిన చీఫ్ విప్ దాస్యం

సీఎం కేసీఆర్ ను కలిసిన చీఫ్ విప్ దాస్యం

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సీఎం కేసీఆర్ ని ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసారు. కేసీఆర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి పనులపై సీఎం తో చీఫ్ విప్ చర్చించారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు మరిన్ని నిధులు కేటాయించాలని విన్నవించారు. చీఫ్ విప్ దాస్యం విన్నపంపై సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరం అందిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కి చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు.