మహిళలకు గూగుల్ గుడ్ న్యూస్

మహిళలకు గూగుల్ గుడ్ న్యూస్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : మహిళల కోసం ‘గూగుల్ జనరేషన్ గూగుల్ స్కాలర్ షిప్’ ప్రకటన విడుదలైంది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి ఏదైనా ఆసియా పసిఫిక్ దేశంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ప్రవేశం పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.మహిళలకు గూగుల్ గుడ్ న్యూస్

బీఈ/బీటెక్ /కంప్యూటర్ సైన్స్ / తత్సమాన కోర్సులు చదువుతున్నవారు. దీంతో పాటు పాఠశాల స్థాయి నుంచి మంచి అకడమిక్ రికార్డ్ తప్పనిసరి. నాయకత్వ లక్షణాలు ఉండాలి. కంప్యూటర్లపై ప్రాథమిక అవగాహన కూడా లేని వారికి అవసరమైన పరిజ్ఞానాన్ని అందుకోవడంలో ఆసక్తి ఉండాలి. టెక్నికల్ ప్రాజెక్టులకు సంబంధించిన నైపుణ్యాలు ఉండాలి.

స్కాలర్ షిప్ : ఎంపికైన వారికి 2022 – 23 యేడాదిలో 1000 డాలర్ల స్కాలర్ షిప్ ను గూగుల్ ఇస్తుంది.

ఎంపిక : దరఖాస్తులను పరిశీలించి అకడమిక్ ప్రతిభ, సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యం తదితరాల అంశాల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ : ఆన్లైన్ లో
దరఖాస్తు చివరి తేదీ : డిసెంబర్ 10
వెబ్ సైట్ : https://buildyourfuture.withgoogle.com