ఆస్కార్ రేస్ లో ‘జైభీమ్’

ఆస్కార్ రేస్ లో 'జైభీమ్'సినిమా డెస్క్ : సూర్య కథానాయకుడిగా నటించిన ‘ జైభీమ్’ చిత్రం ఆస్కార్ కు నామినేట్ అయింది. 94 వ ఆస్కార్ పురస్కారాల బరిలో ఉత్తమ చిత్రం జాబితాలో 276 సినిమాలు పోటీపడుతున్నాయి. ఇందులో భారత్ నుంచి ‘ జైభీమ్’ తో పాటు మోహన్ లాల్ ‘ మరక్కార్’ చోటు దక్కించుకున్నాయి. చెన్నై హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు జీవితం ఆధారంగా సామాజికి ఇతివృత్తంతో దర్శకుడు టీజే జ్ఞానవేళ్ ‘జైభీమ్’ చిత్రాన్ని తెరకెక్కించారు. కోర్టు రూం డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో సూర్య యాక్టింగ్ కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

కాగా 16వ శతాబ్దానికి చెందిన నావికా దళాధిపతి కుంజలి మరక్కార్ జీవితంతో తెరకెక్కిన ‘మరక్కార్ ‘ చిత్రం రెండు జాతీయ అవార్డులను అందుకున్నది. ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందిన సినిమాలో మోహల్ లాల్, అర్జున్, కీర్తి సురేష్ కీలక పాత్రలను పోషించారు. ఆస్కార్ తుది నామినేషన్ జాబితాను ఫిబ్రవరి 8న ప్రకటించబోతున్నారు.