ఏపీ సీఎంను కలిసిన మంజులాదేవి

ఏపీ సీఎంను కలిసిన మంజులాదేవివిజయవాడ : ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ఆ రాష్ట్ర గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు మంజులదేవి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. సీఎంకు వినతి పత్రం అందచేశారు. ప్రభుత్వ నర్సుల సమస్యలను, గవర్నమెంట్ నర్సులు, అవుట్ సోర్సింగ్ నర్సులు ఎదుర్కొంటున్న సమస్యలను వినతి పత్రంలో పేర్కొన్నట్లు మంజులా దేవి తెలిపారు.

లిఖిత పూర్వకంగా రాసిన వినతి పత్రంను సీఎంకు అందించి వారి సమస్యలను సవివరంగా సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీఎం సమస్యల పరిష్కారం దిశగా ఆలోచన చేస్తానని తెలిపినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సీఎంని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఆర్.సూర్యనారాయణ, జనరల్ సెక్రటరీ జి.ఆస్కార రావు, వైస్ ప్రెసిడెంట్స్ రాజు, సుగుణమ్మ, సుధాకర్, కిషోర్ కుమార్, రాజ్ కుమార్, నాగసాయి, ఏపీ కమర్షియల్ టాక్సెస్ అసోసియేషన్, ఏపీ గవర్నమెంట్ డ్రైవర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు.