ఏపీ రైతులకు గుడ్ న్యూస్

ఏపీ రైతులకు గుడ్ న్యూస్

వరంగల్ టైమ్స్,అమరావతి : వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద 2023-24లో కొత్తగా అర్హత పొందే వారు, గతంలో అర్హత ఉండి లబ్ది పొందని వారి నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తోంది. మే 3 వరకు భూయజమానులు, అటవీ భూ సాగుదారులు దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ పేర్కొన్నారు. అర్హులైన వారికి మే నెలలో నేరుగా అకౌంట్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని హరికిరణ్ తెలిపారు. వ్యవసాయం, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖల మూల్యాంకనం సందర్భంగా వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద రైతులకు కూడా కిసాన్ డ్రోన్లు అందజేస్తామని జగన్ ప్రకటించారు. జులై నాటికి 500డ్రోన్లను అందించాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. డిసెంబర్ నాటికి ఈ సంఖ్యను 1500 కు పెంచాలని వ్యవసాయశాఖ యోచిస్తోంది.