మూడో టెస్ట్ కి టీంఇండియా రెడీ

మూడో టెస్ట్ కి టీంఇండియా రెడీకేప్ టౌన్ : సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ చేజిక్కించుకునేందుకు టీం ఇండియా రెడీ అవుతుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇరు జట్లు చెరో టెస్ట్ నెగ్గగా, కేప్ టౌన్ వేదికగా మంగళవారం నుంచి ఆఖరి పోరు ప్రారంభం కానుంది. నిర్ణయాత్మక పోరు కోసం శనివారమే ఇక్కడికి చేరుకున్న భారత జట్టు, ఆదివారం మైదానంలో చెమటోడ్చింది. వెన్నునొప్పి కారణంగా రెండో టెస్టుకు దూరమైన కోహ్లీ నెట్స్ లో తీవ్రంగా శ్రమించారు.

సీనియర్ ప్లేయర్లు పుజారా, రహానే హెడ్ కోచ్ ద్రవిడ్ తో చర్చిస్తూ కనిపించారు. కండరాలు పట్టేయడంతో జొహన్నెస్ బర్గ్ మ్యాచ్ లో పూర్తిస్థాయిలో బౌలింగ్ చేయలేకపోయిన హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఫిట్ నెస్ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ అతను అందుబాటులో లేకపోతే , ఇషాంత్ , ఉమేష్ లో ఒకరికి తుది జట్టులో అవకాశం దక్కనుంది.