బధిర చెస్ చాంపియన్ మలికకు కేటీఆర్ ఆర్థిక సాయం

బధిర చెస్ చాంపియన్ మలికకు కేటీఆర్ ఆర్థిక సాయంహైదరాబాద్ : తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తన ఉన్నతిని చాటుకున్నారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన బధిర చెస్ ప్లేయర్ మలికా హండా తన కుటుంబసభ్యులతో కలిసి ప్రగతి భవన్ లో కేటీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా మలికా హండాకు కేటీఆర్ రూ.15 లక్షల ఆర్థిక సాయం చేశారు.

చెస్ పోటీల కోసం సిద్ధమయ్యేందుకు గాను, ఆమెకు ఉపయోగపడే విధంగా ల్యాప్ టాప్ ను కూడా కేటీఆర్ బహుకరించారు. మలికాకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ను కేటీఆర్ కోరారు. మంత్రి కేటీఆర్ కు మలికాతో పాటు ఆమె కుటుంబసభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.