మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఆలౌట్

మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఆలౌట్స్పోర్ట్స్ డెస్క్ : దక్షిణాఫ్రికా, భారత్ జట్టు మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టీంఇండియా ఆలౌట్ అయింది. 77.3 ఓవర్లలో భారత్ 223 పరుగులు చేసింది. టీమిండియా కెప్టెన్ ఒక్కడే హాఫ్ సెంచరీ చేశాడు. 201 బంతులు ఆడి 79 పరుగులు చేసి కోహ్లీ పెవిలియన్ చేరాడు. పుజారా 43, పంత్ 27, మయాంక్ అగర్వాల్ 15, కేఎల్ రాహుల్ 12, శార్దూల్ ఠాకూర్ 12, రహనే 9, షమీ 7, ఉమేశ్ యాదవ్ 4, అశ్విన్ 2 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబడా 4 వికెట్లు , మార్కో 3 వికెట్లు, ఒలివియర్, ఎంగిడి, మహారాజ్ తలో వికెట్ తీసుకున్నారు.