ఈ ఎమ్మార్వో వార్నింగ్ చూశారా..!

ఈ ఎమ్మార్వో వార్నింగ్ చూశారా..!

వరంగల్ టైమ్స్, భూపాలపల్లి : భూపాల్ పల్లి మండలంలో ప్రభుత్వ సీలింగ్ భూములను ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి ఎమ్మార్వో మహమ్మద్ ఇక్బాల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంగా మారిన తర్వాత ప్రభుత్వ భూముల పై కొందరు కబ్జాదారులు వాటిని ఆక్రమిస్తున్నారు అని అన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై ఉపేక్షించేది లేదన్నారు.ఈ ఎమ్మార్వో వార్నింగ్ చూశారా..!జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇప్పటికే పలు ఇళ్ల నిర్మాణాలను కాంపౌండ్ వాళ్లను కూలగొట్టడం జరిగిందన్నారు. మరికొన్ని ప్రాంతాలలో కబ్జాకు గురిచేసి నిర్మాణాలు చేపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వాటిని కూడా త్వరలోనే తొలగిస్తాం అన్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన తెలిపారు భూములు ఆక్రమణకు గురైన అట్లయితే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే విచారణ చేపట్టి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.