బుల్లీ బాయ్ యాప్ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్

బుల్లీ బాయ్ యాప్ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్న్యూఢిల్లీ : బుల్లీబాయ్ యాప్ కేసులో ప్రధాన నిందితుడు నీరజ్ బిష్ణోయ్ ను ఢిల్లీ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ముస్లిం మహిళల ఫోటోలను ఆన్లైన్ లో వేలం వేస్తున్నట్లు పోస్టు చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో బెంగుళూరుకు చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్ధి విశాల్ కుమార్ తో పాటు ఉత్తరాఖండ్ కు చెందిన మహిళను ముంబై పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు.

ఐతే గురువారం ఢిల్లీ పోలీసులు కూడా ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో అస్సాంకు చెందిన ప్రధానే నిందితుడు నీరజ్ బిష్ణోయ్ ను అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులకు చెందిన ఐఎఫ్ఎస్ ఓ స్పెషల్ సెల్ అతన్ని అరెస్ట్ చేసింది.