రైతు‌ను రాజు‌ చేయడమే ప్రభుత్వ లక్ష్ఖం: హరీశ్ రావు

రైతు‌ను రాజు‌ చేయడమే ప్రభుత్వ లక్ష్ఖం: హరీశ్ రావుహైదరాబాద్ : రైతును రాజు‌ చేయడమే లక్ష్ఖంగా ప్రభుత్వం పని చేస్తుందని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. అందు కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని పథకాలను తెలంగాణ ‌రాష్ట్రంలో అమలు చేస్తున్నారని కొనియాడారు. రైతులకు పెట్టుబడి సాయం కింద‌ 50‌ వేల‌ కోట్ల రూపాయలు అందజేశారన్నారు.

ఈ‌ సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లోని నివాసంలో మంత్రి హరీశ్ రావును ఉమ్మడి జిల్లాల డీసీఎంఎస్ ఛైర్మన్లు కలిసి కృతజ్ఞతలు ‌తెలిపారు. సంక్రాంతి శుభాకాంక్షలు ‌చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి వారిని అభినందిస్తూ సీఎం‌ కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా డీసీఎంఎస్ ఛైర్మన్లు రైతులతో మమేకమయి పని చేయాలన్నారు.