ప్రగతి భవన్ లో ప్రారంభమైన కేబినెట్ సమావేశం

ప్రగతి భవన్ లో ప్రారంభమైన కేబినెట్ సమావేశం

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సోమవారం ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. ముందుగా ..రాష్ట్రంలో కరోనా పరిస్థితి పై చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు, రాష్ట్రంలో కరోనా పరిస్థితి పై గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులో ఉన్నదని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు అన్ని విధాలుగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంసిద్ధంగా ఉన్నదని తెలిపారు.