హైదరాబాద్ : ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. రోజుకు లక్ష ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు చేయాలని ఆదేశించింది. ఆర్‌టీ-పీసీఆర్, ర్యాపిడ్ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని తెలిపింది. భౌతికదూరం, మాస్కుల నిబంధనలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమని అభిప్రాయపడింది. కరోనా వ్యాప్తి నియంత్రణపై ఇవాళ సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు విచారణ సందర్భంగా ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ మేరకు పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.
Home News
Latest Updates
