శరద్ పవార్ కు కరోనా

శరద్ పవార్ కు కరోనాముంబయి : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ కు కరోనా వైరస్ సంక్రమించింది. కరోనా పరీక్షలో ఆయన పాజిటివ్ నిర్దారణ అయింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. డాక్టర్ల సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. గత కొన్ని రోజుల నుంచి తనతో టచ్ లో ఉన్నవాళ్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలని శరద్ పవార్ కోరారు. అందరై జాగ్రత్తలు పాటించాలని ఆయన తన ట్వీట్ లో తెలిపారు.