టీఎస్పీఎస్సీ న్యూ ఇయర్ కానుక  

టీఎస్పీఎస్సీ న్యూ ఇయర్ కానుక

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ సర్కార్ నిరుద్యోగులకు కానుకను అందించింది. తెలంగాణలో 783 పోస్టులతో గ్రూప్- 2 నోటిఫికేషన్ ను టీఎస్పీఎస్సీ జారీ చేసింది. జనవరి 18 నుంచి అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. గతంలో 1032 పోస్టులను గ్రూప్- 2 కింద భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే గ్రూప్- 1, గ్రూప్- 4 నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. గ్రూప్- 1 ప్రిలిమినరీ ఫలితాలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి.టీఎస్పీఎస్సీ న్యూ ఇయర్ కానుక  ఇక గ్రూప్ – 4 నోటిఫికేషన్ కు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కూడా త్వరలోనే ప్రారంభంకానుంది. హాస్టల్ వార్డెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. హార్టికల్చర్, వెటర్నరీ శాఖల్లో కూడా కొలువుల భర్తీకి ప్రకటనలు వెలువడ్డాయి. మరోవైపు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ కొనసాగిస్తోంది. పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ఫిజికల్ ఈవెంట్స్ కొనసాగుతున్నాయి. మొత్తంగా తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది.